Supreme Court Rejects: ఓటర్ల జాబితాల తారుమారుపై సిట్‌కు సుప్రీం నో
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:36 AM
గత ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ సహా కర్ణాటకలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలను తారుమారుచేశారని....
న్యూఢిల్లీ, అక్టోబరు 13: గత ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ సహా కర్ణాటకలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలను తారుమారుచేశారని.. దీనిపై మాజీ న్యాయమూర్తి సారథ్యంలో సిట్ ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ)ని ఆశ్రయించాలని సూచించింది. ప్రజాప్రయోజనం పేరుతో పిటిషన్ వేశారని.. దీనిపై విచారణకు తాము సానుకూలంగా లేమని స్పష్టంచేసింది. ప్రత్యామ్నాయ చట్టబద్ధమైన మార్గాలను అన్వేషించాలని హితవు పలికింది. ఈసీ, బీజేపీ కుమ్మక్కయ్యాయని.. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లను చేర్చారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను పిటిషనర్ తన వ్యాజ్యంలో ప్రస్తావించారు.