Share News

దల్లేవాల్‌ను కలిసిన సుప్రీంకోర్టు ప్యానెల్‌

ABN , Publish Date - Jan 07 , 2025 | 05:10 AM

అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 41 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ను సుప్రీంకోర్టు ప్యానెల్‌ కమిటీ సోమవారం కలిసింది.

దల్లేవాల్‌ను కలిసిన సుప్రీంకోర్టు ప్యానెల్‌

న్యూఢిల్లీ/ఛండీగఢ్‌, జనవరి 6: అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 41 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ను సుప్రీంకోర్టు ప్యానెల్‌ కమిటీ సోమవారం కలిసింది. పంజాబ్‌ హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ నవాబ్‌ సింగ్‌ నేతృత్వంలోని కమిటీ.. అనారోగ్యంతో బాధపడుతున్న దల్లేవాల్‌ను వైద్య సాయం తీసుకోవాలని కోరింది. భేటీ అనంతరం జస్టిస్‌ నవాబ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మేమంతా వైద్య సాయం తీసుకోవాలని దల్లేవాల్‌ను పదే పదే కోరాం. ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తున్నాం. ఆందోళన విరమించమనేందుకు ఇక్కడికి రాలేదని.. ముందు మీరు ఆరోగ్యం గురించి ఆలోచించండని చెప్పి చూశాం. తన ఆరోగ్యం కంటే రైతుల సమస్యలు తీర్చడమే ముఖ్యమని దల్లేవాల్‌ అన్నారు. ఏదేమైనా మేం ఇక్కడే ఉంటామని ఆయనకు చెప్పాం’ అని వెల్లడించారు.

Updated Date - Jan 07 , 2025 | 05:10 AM