Supreme Court: వైద్య కోర్సుల సీట్లు ఖాళీగా ఉండకూడదు
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:03 AM
వైద్య కళాశాలల్లో సీట్లను ఖాళీగా ఉంచకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

3 నెలల్లో విధానాన్ని రూపొందించండి
రాష్ట్రాలతో చర్చించండి
కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం’
న్యూఢిల్లీ, జనవరి 3: వైద్య కళాశాలల్లో సీట్లను ఖాళీగా ఉంచకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వీటి భర్తీ విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములతో చర్చలు జరపాలని కేంద్రాన్ని తాజాగా ఆదేశించింది. ఈ సమస్యపై నిపుణుల కమిటీ అధ్యయనం చేసి ఇచ్చిన సూచనలను పరిశీలించాలని సూచించింది. వైద్య కళాశాలల్లో 1,003 విలువైన సూపర్ స్పెషాలిటీ కోర్సుల సీట్లు భర్తీ కాకపోవడంపై 2023 ఏప్రిల్‌లో జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై మళ్లీ శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగానే సీట్లు ఖాళీగా మిగిలకూడదని వ్యాఖ్యానించింది. 3నెలల్లోగా స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని సూచిస్తూ విచారణను ఏప్రిల్ నెలకు వాయుదా వేసింది.