Supreme Court: ఏపీ, గోవా, త్రిపుర మినహా ఇతర రాష్ట్రాలకు జరిమానా: సుప్రీం కోర్టు
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:49 AM
30 రాష్ట్రాలు, కేం ద్రపాలిత ప్రాంతాలకు రూ.10వేల వంతున జరిమానా వేసింది. కేవలం ఆంధ్రప్రదేశ్, త్రిపుర, గోవా రాష్ట్రాలు మాత్రమే కార్యాచరణ ప్రణాళికలు తయారు చేశాయి.
అక్రమ తుపాకుల నివారణపై ప్రణాళికలు లేనందుకు చర్య
అక్రమ తుపాకుల తయారీ, అమ్మకాలను నిరోధించడానికి కార్యాచరణను తయారు చేయాలన్న ఆదేశాలను అమలు చేయనుందుకు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు జరిమానా విధించింది. 30 రాష్ట్రాలు, కేం ద్రపాలిత ప్రాంతాలకు రూ.10వేల వంతున జరిమానా వేసింది. కేవలం ఆంధ్రప్రదేశ్, త్రిపుర, గోవా రాష్ట్రాలు మాత్రమే కార్యాచరణ ప్రణాళికలు తయారు చేశాయి. ప్రణాళికలు రూపొందించాలంటూ గత ఏడాది నవంబరు ఏడో తేదీన ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఎస్.సి.శర్మ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.