Share News

Supreme Court: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ విపుల్‌ పంచోలి!

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:32 AM

బాంబే హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, పట్నా హైకోర్టు సీజే జస్టిస్‌ విపుల్‌ పంచోలిలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించాలని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది.

Supreme Court: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ విపుల్‌ పంచోలి!

న్యూఢిల్లీ, ఆగస్టు 25: బాంబే హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, పట్నా హైకోర్టు సీజే జస్టిస్‌ విపుల్‌ పంచోలిలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించాలని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ బీవీ నాగరత్న కొలీజియం సోమవారం మధ్యాహ్నం సమావేశమై చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ సుధాంశు ధులియా పదవీ విరమణ పొందడంతో 34 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవుల్లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. కొలీజియం సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే.. రాష్ట్రపతి ఉత్తర్వులతో వారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులవుతారు.

Updated Date - Aug 26 , 2025 | 02:08 AM