The Supreme Court has permitted: ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో హరిత టపాసులకు సుప్రీంకోర్టు ఓకే
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:11 AM
దీపావళి సందర్భంగా ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో పర్యావరణ హిత టపాసుల విక్రయాలు....
దీపావళి నేపథ్యంలో పలు షరతులతో అనుమతి
19, 20వ తేదీల్లో 3 గంటల చొప్పున మాత్రమే..
న్యూఢిల్లీ, అక్టోబరు 15: దీపావళి సందర్భంగా ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో పర్యావరణ హిత టపాసుల విక్రయాలు, వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఇది తాత్కాలికమేనని.. ఇందుకు సంబంధించి పలు షరతులను కూడా విధించింది. ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకే పర్యావరణ హిత బాణసంచా అమ్మకాలకు అనుమతి ఉంటుందని.. అలాగే 19, 20వ తేదీ (దీపావళి)న మాత్రమే ఆ టపాసులు కాల్చుకోవచ్చని స్పష్టం చేసింది. అది కూడా ఈ రెండు రోజుల్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు.. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమేనని వివరించింది. గతేడాది ఢిల్లీలో టపాసులపై విధించిన పూర్తి నిషేధాన్ని సడలించాలంటూ కేంద్రం, ఢిల్లీ సర్కారు సంయుక్తంగా చేసిన అభ్యర్థనను, గ్రీన్ క్రాకర్స్ తయారీదారుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ధర్మాసనం బుధవారం అనుమతునిచ్చింది. ‘నీరి (సీఎ్‌సఐఆర్-జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ సంస్థ) ఆమోదించిన గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే అనుమతిస్తారు.