Rajasthan Incident: అది ఇస్తే.. నీ భార్యను తిరిగి తీసుకొస్తా.. తాంత్రికుడి మాటలు నమ్మి భర్త దారుణం.!
ABN , Publish Date - Jul 24 , 2025 | 01:37 PM
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. తన భార్య కోసం ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. తాంత్రికుడి మాటలు నమ్మి మేనల్లుడిని హత్య చేశాడు. అసలేం జరిగిందంటే..
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన భార్య కోసం ఓ భర్త అతి దారుణానికి ఒడిగట్టాడు. తాంత్రికుడి మాటలు గుడ్డిగా నమ్మి సొంత మేనల్లుడిని హత్య చేశాడు. అసలేం జరిగిందంటే..
ముండావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారాయ్ కాలా గ్రామంలో యువకుడు మనోజ్ కుమార్‌కు పెళ్లి అయింది. అయితే, అతడి భార్య కొంత కాలానికే అతడి నుండి విడిపోయి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు భర్త ఎన్ని ప్రయత్నాలు చేసినా భార్య తన దగ్గరకు వెళ్లేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఎలాగైనా సరే తన భార్య తన దగ్గరకు వచ్చేలా చేయాలని భర్త స్థానిక తాంత్రికుడు సునీల్‌ను ఆశ్రయించాడు.
అయితే, ఆ తాంత్రికుడు తనకు రక్తం, లివర్ ఇస్తే నీ భార్య నీ దగ్గరకు వచ్చేలా చేస్తానని భరోసా కల్పించాడు. దీంతో ఆ భర్త తాంత్రికుడి మాటలు గడ్డిగా నమ్మి తన 6 ఏళ్ల మేనల్లుడు లోకేష్‌ను బలి చేశాడు. మనోజ్, లోకేష్‌ను ఓ పాడుబడిన ఇంటికి తీసుకెళ్లి, ముందుగా గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత ఇంజెక్షన్లతో శరీరం నుండి రక్తం, కాలేయాన్ని తీయడానికి ప్రయత్నించాడు కానీ కుదరలేదు. తరువాత, మృతదేహాన్ని గడ్డి కుప్పలో దాచి ఉంచాడు. తాంత్రికుడికి తర్వాత శరీర భాగాలు తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు. ఈ ఘటన జూలై 19 రాత్రి జరిగింది.
లోకేష్ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై విచారణ చేపట్టగా ఆ రాత్రే గ్రామంలో ఉన్న ఓ పాడుబడిన ఇంట్లో గడ్డి కుప్పలో లోకేష్ మృతదేహం కనిపించింది. స్థానిక సీసీ ఫుటేజ్, కుటుంబ సభ్యుల దగ్గర పూర్తిగా సమాచారం సేకరించిన పోలీసులు జూలై 21న లోకేష్ మామ మనోజ్ కుమార్‌ను అనుమానించి అరెస్టు చేశారు. అతన్ని విచారించగా, తాంత్రికుడి చెప్పిన మాటల ప్రభావంతో తాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
2 నెలల్లో ఓఆర్‌ఆర్ ఆర్థిక ప్రతిపాదనలు
Read Latest Telangana News and National News