Share News

Srinivasa Rao to Received: కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శీనివాసరావుకు గంగాశరణ్‌ సింగ్‌ పురస్కారం

ABN , Publish Date - Aug 10 , 2025 | 02:43 AM

దేశంలో హిందీ సాహిత్యం, భాషల పురోగతికి విశిష్టమైన సేవలు అందించినందుకు కేంద్ర సాహిత్య అకాడమీ

Srinivasa Rao to Received: కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శీనివాసరావుకు గంగాశరణ్‌ సింగ్‌ పురస్కారం

న్యూఢిల్లీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): దేశంలో హిందీ సాహిత్యం, భాషల పురోగతికి విశిష్టమైన సేవలు అందించినందుకు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యద ర్శి కృత్తివెంటి శ్రీనివాసరావుకు బిహార్‌ ప్రభు త్వ ప్రతిష్టాత్మకమైన గంగాశరణ్‌ సింగ్‌ పురస్కారం లభించింది. ఈ నెల 23న బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ చేతుల మీదుగా ఆయనకు ఈ పురస్కారాన్ని అందజే స్తారు. పురస్కారంలో భాగంగా ఆయనకు లక్ష రూపాయల నగదును బహూకరించి సత్కరిస్తారు. దేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ అనుయాయుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు గంగాశరణ్‌ సింగ్‌ హిందీని జాతీయ భాషగా గుర్తించేందుకు చేసిన కృషి రీత్యా ఆయన పేరిట ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

Updated Date - Aug 10 , 2025 | 02:43 AM