Share News

Srilanka on Pahalgam attack: పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించిన శ్రీలంక

ABN , Publish Date - Apr 23 , 2025 | 09:07 PM

పహల్గాం దాడిని ప్రపంచమంతా తీవ్రంగా ఖండిస్తోంది. శ్రీలంక అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత సైతం ఉగ్రమూకల చర్యని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్‌కు తమ హృదయపూర్వక సంఘీభావాన్ని ప్రకటించారు.

Srilanka on Pahalgam attack: పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించిన శ్రీలంక
Sri Lanka condemn Pahalgam attack

Sri Lanka condemn Pahalgam attack: దక్షిణ కాశ్మీర్‌ అయిన పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఘోరమైన దాడిని యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఇప్పటికే ప్రపంచ నేతలంతా భారత్‌కు తమ సంఘీభావం తెలుపుతూ ఉగ్రమూకలపై విరుచుకుపడుతుంటే, దాయాది దేశం శ్రీలంక కూడా పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించింది. జమ్మూలోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని శ్రీలంక అధికార, ప్రతిపక్ష నాయకులు ఖండించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో చేసిన ఒక పోస్ట్‌లో, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్నాయకే ఇలా అన్నారు: “భారతదేశంలో జరిగిన పిరికి ఉగ్రవాద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధితులు, వారి కుటుంబాలకు హృదయపూర్వక మద్ధతునిస్తాం. శ్రీలంక ఎల్లప్పుడూ భారత ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది.”


ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస మాట్లాడుతూ, “జమ్మూ & కాశ్మీర్‌లో జరిగిన పిరికి ఉగ్రవాద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అమాయక పౌరులపై హింస.. మానవాళికి వ్యతిరేకంగా జరిగే తీవ్రమైన నేరం. బాధితులు, వారి కుటుంబాలు మరియు భారత ప్రజలకు మేము సంఘీభావంగా నిలుస్తాము. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం ఎల్లప్పుడూ ఐక్యంగా నిలబడాలి.” అన్నారు. అటు, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెర్రెస్ పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించారు.

నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని భారతదేశానికి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.

కాగా, పహల్గాం ముష్కర దాడిలో 26 మంది మరణించిన తర్వాతి రోజైన ఇవాళ పహల్గాం మార్కెట్ నిర్జనమై ఉంది. షాపులన్నీ మూసివేయడంతో రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్నాయి.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 23 , 2025 | 09:07 PM