Share News

Special Discussion on Shubhanshu: శుభాన్షుపై ప్రత్యేక చర్చ

ABN , Publish Date - Aug 19 , 2025 | 02:54 AM

మిషన్‌ ఏఎక్స్‌ 4 ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చిన భారత తొలి వ్యోమగామి శుభాన్షు శుక్లా...

Special Discussion on Shubhanshu: శుభాన్షుపై ప్రత్యేక చర్చ

మిషన్‌ ‘ఏఎక్స్‌-4’ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చిన భారత తొలి వ్యోమగామి శుభాన్షు శుక్లా గౌరవార్ధం సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చను చేపట్టారు. అంతకుముందు ఆయన ప్రధాని మోదీని కలిశారు. బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ గురించి విపక్షాల ఆందోళన మధ్యనే శుక్లా ఘనతపై లోక్‌సభలో చర్చ జరిగింది. దేశంలోని ప్రతి బిడ్డకు శుభాంశు శుక్లా స్ఫూర్తిగా మారారని, ఆయనలా ఎదగాలని, అంతరిక్ష యాత్రలు చేయాలని ప్రతి ఒక్కరూ కలలు కంటున్నారని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. శుభాంశుపై చర్చను బహిష్కరిస్తూ విపక్ష సభ్యులు సభ నుంచి వెళ్లిపోయిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇది అత్యంత దురదృష్టకరమని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. కాగా, శుక్లాపై ప్రత్యేక చర్చలో విపక్షం పాల్గొనబోదని, తనకు ముందే తెలుసని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ.. అంతరిక్ష హీరో, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లాను ప్రశంసించకుండా ఉండలేనన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 02:54 AM