Sonam Raghuvanshi: ఆ చిన్న తప్పు.. సోనమ్‌ను పట్టించింది..
ABN , Publish Date - Jun 18 , 2025 | 09:47 PM
Sonam Raghuvanshi: రాజాపై ముగ్గురు నిందితులు కలిసి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సోనమ్ కళ్లముందే నిందితులు రాజాను హత్య చేశారు. అనంతరం సోనమ్ తన భర్త ఫోన్‌ను ధ్వంసం చేసింది.
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కొత్త కొత్త విషయాలు, ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. భర్తను పక్కా ప్లాన్‌తో మర్డర్ చేయించిన సోనమ్ మూడు ఫోన్లు వాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజా రఘువంశీని మర్డర్ చేయించిన తర్వాత అతడి ఫోన్‌ను స్వయంగా ఆమే పగుల గొట్టింది. అనంతరం దాన్ని రాజా శవంతో పాటు పారేసి ముగ్గురూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోనమ్ తన మూడు ఫోన్లతో మధ్యప్రదేశ్ బయలుదేరింది. ఇండోర్ చేరుకోగానే వాట్సాప్ మెజేస్‌లు చెక్ చేసుకోవడానికి సిమ్ కార్డును ఫోన్‌లో వేసి ఆన్ చేసింది.
వాట్సాప్ మెసేజ్‌లు చూసుకున్న తర్వాత ఫోన్ మళ్లీ స్విచ్ఛాప్ చేసింది. అయితే, సోనమ్ చేసిన ఈ పొరపాటు కారణంగా పోలీసులు ఆమెను ట్రేస్ చేశారు. సోనమ్ పోలీసులకు దొరికి పోయిన తర్వాత ఫోన్ల గురించి అడిగారు. ఆమె వాటిని ఎక్కడ దాచిందో ఎంత అడిగినా చెప్పటం లేదు. మూడు ఫోన్లు ఎక్కడున్నాయో తెలియటం లేదు. పోలీసులు ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లలోని చాలా జిల్లాల్లో ఫోన్ల కోసం వెతుకుతున్నారు. నిన్న మేఘాలయలోని వే సాడాంగ్ లో క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు.
సోనమ్‌తో పాటు మిగిలిన నిందితుల్ని కూడా తీసుకెళ్లారు. రాజాపై ముగ్గురు నిందితులు కలిసి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సోనమ్ కళ్లముందే నిందితులు రాజాను హత్య చేశారు. అనంతరం సోనమ్ తన భర్త ఫోన్‌ను ధ్వంసం చేసింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే అంతా చేశారు. తర్వాత రాజా మృతదేహాన్ని దూరంగా తీసుకెళ్లి పారేశారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ నిందితులెప్పుడూ మేఘాలయ రాలేదు. రాజాను మేఘాలయ తీసుకొచ్చి మరీ మర్డర్ చేశారు.
ఇవి కూడా చదవండి
నీటిపైకి ఓర్ చేప.. ప్రళయం రాబోతోందా?
కమల్ కౌర్ హత్య.. పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు..