Share News

Kamal Kaur Bhabhi: కమల్ కౌర్ హత్య.. పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు..

ABN , Publish Date - Jun 18 , 2025 | 03:52 PM

Kamal Kaur Bhabhi: కమల్ కౌర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వైరల్ అవుతూ ఉండేది. కొద్దిరోజుల క్రితం నిందితుడు నిహంగ్ అమ్రిత్‌పాల్ సింగ్ మెహ్రాన్ .. కమల్ కౌర్‌ను కాంటాక్ట్ అయ్యాడు.

Kamal Kaur Bhabhi: కమల్ కౌర్ హత్య.. పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు..
Kamal Kaur Bhabhi

పంజాబ్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కాంచన్ కుమారీ అలియాస్ కమల్ కౌర్ భాబీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. జూన్ 11వ తేదీన ఆమె ఓ కారులో శవమై కనిపించారు. తాజాగా, కమల్ కౌర్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కమల్ కౌర్‌ను గొంతు నులిమి చంపేశారని వైద్యులు తేల్చారు. కమల్ కౌర్ తొడలు, ప్రైవేట్ భాగాలపై అనుమానాస్పద గుర్తులు ఉన్నట్లు తేల్చారు.


అయితే, ఆమెపై అత్యాచారం జరిగిందన్న విషయాన్ని మాత్రం వైద్యులు ధ్రువీకరించలేదు. చనిపోవడానికి ముందు ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా ? అని తెలుసుకోవడానికి శ్వాబ్, విసెరా శాంపిల్స్‌ను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపారు. ఇక, కమల్ కౌర్‌ను తానే హత్య చేశానని నిహంగ్ అమ్రిత్‌పాల్ సింగ్ మెహ్రాన్ ప్రకటించాడు. అయితే, హత్య తర్వాత అతడు యూఏఈ పారిపోయాడు. ఇదే కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తున్నారు.


వాహనాల ప్రమోషన్ కోసం పిలిచి..

కమల్ కౌర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వైరల్ అవుతూ ఉండేది. కొద్దిరోజుల క్రితం నిందితుడు నిహంగ్ అమ్రిత్‌పాల్ సింగ్ మెహ్రాన్ .. కమల్ కౌర్‌ను కాంటాక్ట్ అయ్యాడు. బతిందలో వాహనాల ప్రమోషన్ ఉందని ఆమెను నమ్మించాడు. లుథియానా నుంచి ఆమె జూన్ 9వ తేదీన వాహనాల ప్రమోషన్ కార్యక్రమానికి వెళ్లింది. ఆ తర్వాతి నుంచి కనిపించకుండా పోయింది. జూన్ 11వ తేదీన కారులో శవమై తేలింది.


ఇవి కూడా చదవండి

పెళ్లై 70 ఏళ్లు.. భార్య మీద ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు..

నైట్ టైంలో ఆకలిగా అనిపిస్తుందా.. ఈ విషయాలు తెలుసుకోండి..

Updated Date - Jun 18 , 2025 | 04:05 PM