Share News

Karnataka CM Case: సిద్దరామయ్యకు బిగిసిన ఉచ్చు

ABN , Publish Date - Apr 16 , 2025 | 06:54 AM

కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు కేసులో విచారణ కొనసాగించాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. లోకాయుక్త ప్రాథమిక చార్జ్‌షీట్‌(బి-రిపోర్ట్‌)ను అంగీకరించకూడదని సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Karnataka CM Case: సిద్దరామయ్యకు బిగిసిన ఉచ్చు

  • ముడా కేసు దర్యాప్తును కొనసాగించండి

  • మే 7లోగా నివేదికివ్వండి లోకాయుక్తకు ప్రజా

  • ప్రతినిధుల కోర్టు ఆదేశం

బెంగళూరు, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ప్రజాప్రతినిధుల కేసులు విచారించే ప్రత్యేక కోర్టులో ఉచ్చు బిగిసింది. మైసూ రు నగరాభివృద్ధి ప్రాధికార(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు కేసు దర్యాప్తును కొనసాగించాలని లోకాయుక్తను ప్రజాప్రతినిధుల కేసుల కోర్టు ఆదేశించింది. ఈ కేసులో సిద్దరామయ్య, ఆయన కు టుంబసభ్యుల తప్పిదం లేదని లోకాయుక్త ప్రాథమిక చార్జ్‌షీట్‌(బి-రిపోర్ట్‌)లో పేర్కొంది. దీన్ని వ్యతిరేకించిన సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. లోకాయు క్త దర్యాప్తు సరిగా లేదని అభ్యంతరం తెలిపారు. దర్యాప్తులో వదిలేసిన అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. లోకాయుక్త బి-రిపోర్టును అంగీకరించవద్దని విన్నవించారు. దీనిపై విచారణ జరిపిన ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయాధికారి సంతోష్‌ గజానన్‌ భట్‌ ముడా కేసులో విచారణ కొనసాగించాలని మంగళవారం లోకాయుక్తను ఆదేశించారు. ప్రాథమిక చార్జిషీట్‌ ఆధారంగా నిర్ణయం తీసుకోలేమని, సమగ్ర నివేదికతో చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన తర్వాతనే నిర్ణ యం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈడీ అభ్యంతరాల పిటిషన్‌ దాఖలు చేయవచ్చునని సూచించారు. మే 7లోగా సమగ్ర దర్యాప్తు నివేదికను సమర్పించాలని లోకాయుక్తకు సూచించారు. అప్పటివరకు ఈడీ తనిఖీలపై స్టే ఉంటుందని తెలిపారు. దీంతో బి-రిపోర్టు ఆధారంగా ప్రజాప్రతినిధుల కోర్టులో ఉపశమనం పొందవచ్చనని భావించిన సీఎం సిద్దరామయ్యకు షాక్‌ తగిలింది.

Updated Date - Apr 16 , 2025 | 06:55 AM