Shubhanshu Shukla: కుపోలా.. భూమండలాన్ని చూపించే కిటికీ!
ABN , Publish Date - Jul 08 , 2025 | 05:18 AM
భారత సంతతి వ్యోమగామి శుభాన్షు శుక్లా వెనుక కనిపిస్తున్నది అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఐఎస్‌ఎస్)లోని ఓ కిటికీ. పేరు కుపోలా.
న్యూఢిల్లీ, జూలై 7: భారత సంతతి వ్యోమగామి శుభాన్షు శుక్లా వెనుక కనిపిస్తున్నది అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఐఎస్‌ఎస్)లోని ఓ కిటికీ. పేరు కుపోలా. మన ఇంట్లో కిటికీ నుంచి చూస్తే మహా అయితే వీధి చివర వరకు, ఇంకా అంటే ఊరి చివరి చెట్లు, భవనాల వరకు చూడొచ్చు. కానీ, ఈ కిటికీ నుంచి భూమండలం మొత్తం కనిపిస్తుంది. 14రోజుల మిషన్‌లో భాగంగా జూన్ 26న ఐఎ్‌సఎస్ వెళ్లిన శుభాన్షు శుక్లా సోమవారం ఈ కిటికీ దగ్గర ఉన్న ఫొటోలను పంపించారు. కుపోలా అంటే ఇటాలియన్ భాషలో డోము అని అర్థం.
ఇది ఏడు గాజు అద్దాలతో కూడిన నిర్మాణం. 2010లో దీన్ని ఐఎ్‌సఎ్‌సలో ఏర్పాటు చేశారు. ఉల్కల్లాంటివి తాకి అద్దాలు ధ్వంసం కాకుండా కిటికీలోని ఈ ఏడు అద్దాలకు షట్టర్లు ఉంటాయి. వ్యోమగాములు భూమండలాన్ని, అంతరిక్షాన్ని చూడాలనుకున్నప్పుడు ఆ షట్టర్లను తెరుస్తారు