Harassment: ధమన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
ABN , Publish Date - Jun 25 , 2025 | 07:02 AM
నల్లగొండ బిషప్ కరణం ధమన్‌కుమార్‌పై జర్మనీలోని మున్‌స్టర్ నగరంలో క్రైస్తవ మత గురువుగా పనిచేసినప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి.
జర్మనీలోని మున్‌స్టర్‌లో మతాధికారిగా పనిచేసినప్పటి ఘటనపై ఫిర్యాదులు
న్యూఢిల్లీ, జూన్ 24: నల్లగొండ బిషప్ కరణం ధమన్‌కుమార్‌పై జర్మనీలోని మున్‌స్టర్ నగరంలో క్రైస్తవ మత గురువుగా పనిచేసినప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. 2005-2007 సంవత్సరాల మధ్య ఈ ఘటన చోటుచేసుకుందంటూ ఈ ఏడాది మార్చిలో ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో బిషప్ కరణం ధమన్‌కుమార్ మున్‌స్టర్ బిషప్ అధికార పరిధిలోని ప్రాంతంలో మతాధికారిగా, మత సంబంధిత ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా నిషేధం విధిస్తున్నామంటూ తాజాగా మున్‌స్టర్ బిషప్ ప్రకటన జారీ చేశారు. దీనికి సంబంధించి ది న్యూస్ మినిట్ వెబ్‌సైట్ ఓ కథనం ప్రచురించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన ధమన్‌కుమార్.. 2001 నుంచి 2012 వరకు మున్‌స్టర్ నగరంలో మత గురువుగా పనిచేశారు. తర్వాత 2017లో భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో క్రైస్తవ మతబోధకుడిగా ప్రచారం చేశారు. తిరిగి 2017 నుంచి 2020 వరకు మున్‌స్టర్ నగరంలో, తర్వాత ఆ దేశంలోనే ఓల్డెన్‌బర్గ్ బార్తోలోమస్ చర్చిలో ఫాదర్‌గా పనిచేశారు. పోప్ ఫ్రాన్సిస్ 2024 ఏప్రిల్‌లో ధమన్‌కుమార్‌ను నల్లగొండ బిష్‌పగా నియమించారు.