Share News

Kashmir : కశ్మీర్‌లో ఏడుగురు చొరబాటుదారుల హతం

ABN , Publish Date - Feb 08 , 2025 | 05:35 AM

నియంత్రణ రేఖను దాటివచ్చి భారత సైన్యానికి చెందిన ఫార్వర్డ్‌ పోస్టుపై దాడికి యత్నించిన ఏడుగురు చొరబాటుదారులను భద్రతా బలగాలు హతమార్చాయి. చనిపోయిన

Kashmir : కశ్మీర్‌లో ఏడుగురు చొరబాటుదారుల హతం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: నియంత్రణ రేఖను దాటివచ్చి భారత సైన్యానికి చెందిన ఫార్వర్డ్‌ పోస్టుపై దాడికి యత్నించిన ఏడుగురు చొరబాటుదారులను భద్రతా బలగాలు హతమార్చాయి. చనిపోయిన వారిలో ఇద్దరు ముగ్గురు పాక్‌ ఆర్మీకి చెందినవారిగా భావిస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. మిగిలినవారు అల్‌-బదర్‌ గ్రూప్‌ ఉగ్రవాదులు కావొచ్చని పేర్కొన్నాయి. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో మంగళవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడటానికి యత్నించారు. మెరుపువేగంతో స్పందించిన భారత సైన్యం వారిపై కాల్పులు జరిపి మట్టుబెట్టింది. ఈ చొరబాటు, దాడి యత్నం వెనుక పాకిస్థాన్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌(బీఏటీ) ఉందని భావిస్తున్నారు.

Updated Date - Feb 08 , 2025 | 05:35 AM