Coimbatore : తమిళనాడులో బాలికపై ఏడుగురి గ్యాంగ్ రేప్
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:23 AM
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కునియముత్తూరు ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై ఏడుగురు కాలేజీ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కోయంబత్తూరు ఉక్కడం ప్రాంతానికి
చెన్నై, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కునియముత్తూరు ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై ఏడుగురు కాలేజీ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కోయంబత్తూరు ఉక్కడం ప్రాంతానికి చెందిన బాలిక ఇంటర్ ఫెయిలై బామ్మ ఇంట్లో ఉంటోంది. ఇటీవల ఆ బాలికకు సామాజిక మాధ్యమాల ద్వారా కునియముత్తూరుకు చెందిన కాలేజీ విద్యార్థితో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆ బాలికను మాయమాటలతో కునియముత్తూరులో ఉన్న తన గదికి రప్పించుకున్న ఆ విద్యార్థి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను నగ్నంగా ఫోటోలు తీశాడు. అంతేగాక ఆరుగురు సహచర విద్యార్థులను కూడా తన గదికి రప్పించి, ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు. బాలికను సోమవారం ఉదయం వారు ఆమె ఇంటివద్ద విడిచిపెట్టి పారిపోయారు. ఈ ఘటనపై ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏడుగురు విద్యార్థులను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.