R V Deshpande: నేను సీఎం అయితేగ్యారెంటీలనిచ్చేవాడిని కాదు
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:26 AM
తాను ముఖ్యమంత్రిని అయ్యుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలను అమలు.....
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్‌వీ దేశ్‌పాండే
బెంగళూరు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): తాను ముఖ్యమంత్రిని అయ్యుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలను అమలు చేసేవాడిని కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఆర్‌వీ దేశ్‌పాండే అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు మహిళలకు మాత్రమే అనేలా మారాయని, పురుషులకు సీట్లు దొరకడం లేదని పేర్కొన్నారు. ‘ఓ దేవుడా.. ధారవాడ, బెళగావి, కలబురగితోపాటు రేణుకా యల్లమ్మ ఆలయాలకు మహిళలకు తరలిపోతున్నారు. ఆ ప్రాంతంలో బస్సుల్లో పురుషులు ప్రయాణించాలంటే తిప్పలు పడాల్సి వస్తోంది’ అని వ్యాఖ్యానించారు. గృహలక్ష్మి ద్వారా నెలకు రూ.2వేలు ఇస్తున్నారని, ఇది మహిళలకు లాటరీ కొట్టినట్లుగా ఉందని, పురుషుల పరిస్థితి మరింత అధ్వానమైందని, ఇంకా ఎక్కువగా మాట్లాడాలంటే పురుషులను పరోక్షంగా శిక్షించినట్లు ఉందని పేర్కొన్నారు. కాగా, ఆర్‌వీ దేశ్‌పాండే చేసిన వ్యాఖ్యలపై సీఎం సిద్దరామయ్య వివరణ కోరార.