Seeman: దున్నపోతా.. అని తిడితే చూస్తూ ఊరుకోం..
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:57 AM
ఎవరినైనా ‘దున్నపోతా’ అని తిడితే చూస్తూ ఊరుకోమని నామ్‌తమిళర్ కట్చి నేత సీమాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మదురై సమీపం వీరాదనూరులో పార్టీ వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన పశువులు, మేకల మహానాడులో ఆయన ప్రసంగించారు. ఈ మహానాడులో ఓ వైపు పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- పశువుల మహానాడులో సీమాన్ ఆగ్రహం
చెన్నై: ఎవరినైనా ‘దున్నపోతా’ అని తిడితే చూస్తూ ఊరుకోమని నామ్‌తమిళర్ కట్చి నేత సీమాన్(Seeman) ఆగ్రహం వ్యక్తం చేశారు. మదురై సమీపం వీరాదనూరులో పార్టీ వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన పశువులు, మేకల మహానాడులో ఆయన ప్రసంగించారు. ఈ మహానాడులో ఓ వైపు పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరో వైపు సుమారు రెండు వందలకు పైగా పశువులు, మేకలను కంచెలో నిలిబెట్టారు.

పశువులకు మేయడానికి ప్రతి ఊరిలోనూ ప్రత్యేక స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, పశువులను మేతకు తీసుకెళ్లేవారిపై అటవీ శాఖ సిబ్బంది దాడులను ఖండిస్తూ సీమాన్ ఈ మహానాడు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీమాన్ ప్రసంగిస్తూ పశువులు, మేకలను మేపేందుకు అవమానంగా భావించకూడదని, అదృష్టంగా భావించాలన్నారు.

పశువులకు ప్రత్యేకంగా పండుగ జరుపుతున్న సంస్కృతి మనది అని, ఇకపై ఎవరూ ఎవరినీ దున్నపోతా అని తిట్టకూడదని, అలా తిడితే తాను చూస్తూ ఊరుకోననని చెప్పారు. తేని జిల్లాలో పశువులను అటవీ ప్రాంతంలో మేపడానికి తీసుకెళ్ళిన రైతుపై అటవీ శాఖ అధికారులు జరిపిన దాడిని ఖండిస్తూ ఆగస్టు 3న ఆ ప్రాంతంలోనే వేల సంఖ్యలో పశువులను, మేకలను మేతకు తీసుకెళ్లే ఆందోళన జరుపనున్నట్లు సీమాన్ ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..
Read Latest Telangana News and National News