Karighatta Hill: కర్రెగుట్ట కొండను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు.. త్రివర్ణ పతాకం రెపరెపలు
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:43 PM
నక్సల్స్ ఏరివేతలో భాగంగా గతవారంలో ఈ అతిపెద్ద ఆపరేషన్‌ను బలగాలు చేపట్టాయి. బుధవారంతో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ తొమ్మిదో రోజుకు చేరింది. ఎయిర్ డ్రాప్ ద్వారా కమాండోలు కొండపైకి చేరుకుని ఆపరేషన్ చేపట్టారు.

బిజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌లో బుధవారంనాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న నక్సల్స్ అధీనంలోని కర్రెగుట్ర కొండను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతాన్ని నక్సల్స్ నుంచి విముక్తి చేస్తూ... తమ విజయానికి చిహ్నంగా కొండ పైభాగంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు.
PM Modi: మోదీ రష్యా పర్యటన రద్దు
నక్సల్స్ ఏరివేతలో భాగంగా గతవారంలో ఈ అతిపెద్ద ఆపరేషన్‌ను బలగాలు చేపట్టాయి. బుధవారంతో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ తొమ్మిదో రోజుకు చేరింది. ఎయిర్ డ్రాప్ ద్వారా కమాండోలు కొండపైకి చేరుకుని ఆపరేషన్ చేపట్టారు. వివిధ యూనిట్లకు చెందిన సుమారు 24,000 మంది భద్రతా సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్లు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, రాష్ట్ర పోలీసు విభాగాలు, సీఆర్‌పీఎఫ్, ఎలైట్ కమండో బెటాటియన్స్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) కమెండోలో ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 2,000 సాయుధ నక్సలైట్లు భద్రతా బలగాల ట్రాప్‌లో చిక్కినట్టు తెలుస్తోంది.
కర్రెగుట్ట కొండ ఐదు వేల అడుగుల ఎత్తులో ఉండే పర్వత ప్రాంతం కావడంతో పాటు, ప్రస్తుతం ఆ కొండపై ఉష్ణోగత 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉంది. నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
ఇవి కూడా చదవండి..