Share News

Maoists in Bastar: బస్తర్‌లో ఇంకా 400మంది నక్సలైట్లు: బస్తర్‌ ఐజీ

ABN , Publish Date - Mar 03 , 2025 | 01:35 AM

వీరికి మద్దతుగా మిలీషియా సభ్యులతోపాటు చేతన నాట్య మంచ్‌, దండకారణ్య ఆదివాసీ కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్‌(డీఏకేఎంఎస్‌) వంటి సాంస్కృతిక సంస్థల సభ్యులు 700 నుంచి 800 మంది ఉన్నారని తెలిపారు.

Maoists in Bastar: బస్తర్‌లో ఇంకా 400మంది నక్సలైట్లు: బస్తర్‌ ఐజీ

న్యూఢిల్లీ, మార్చి 2: 2024 జనవరి నుంచి 310 మంది మావోయిస్టులను విజయవంతంగా అంతమొందించామని, బస్తర్‌ డివిజన్‌లో ఇక సుమారు 400 మంది సాయుధ క్యాడర్‌ మాత్రమే మిగిలి ఉన్నారని బస్తర్‌ ఐజీ పి.సుందర్‌రాజ్‌ చెప్పారు. వీరికి మద్దతుగా మిలీషియా సభ్యులతోపాటు చేతన నాట్య మంచ్‌, దండకారణ్య ఆదివాసీ కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్‌(డీఏకేఎంఎస్‌) వంటి సాంస్కృతిక సంస్థల సభ్యులు 700 నుంచి 800 మంది ఉన్నారని తెలిపారు. హింసను వీడి లొంగిపోవాలా? లేక తుది పోరులో భద్రతా దళాలతో తలపడాలా? అనేది ఈ 1200 మంది నిర్ణయించుకోవాలని తేల్చిచెప్పారు. మావోయిస్టు కేంద్ర కమిటీ కూడా గణనీయంగా బలహీనపడిందని, కమాండర్లు 12 నుంచి 14 మంది మాత్రమే మిగిలి ఉన్నారని చెప్పారు. కాగా, మార్చి-2026 నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని అంతమొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Updated Date - Mar 03 , 2025 | 01:35 AM