Share News

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ ఓ నటుడు మాత్రమే కాదు.. అతడి సామ్రాజ్యం, ఆస్తి వివరాలు తెలిస్తే..

ABN , Publish Date - Jan 16 , 2025 | 02:36 PM

సైఫ్ అలీఖాన్ కేవలం ఓ నటుడు మాత్రమే కాదు.. ఘనమైన చరిత్ర కలిగిన రాజకుటుంబానికి వారుసుడ. హైప్రొఫైల్ నేపథ్యం. సైఫ్ తల్లిదండ్రులిద్దరూ సెలబ్రిటీలు. ఆయన తండ్రి మన్సూర్ అలీఖాన్ పటౌడి టీమిండియా క్రికెటర్, తల్లి షర్మిలా టాగోర్ ప్రఖ్యాత బాలీవుడ్ నటి.

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ ఓ నటుడు మాత్రమే కాదు.. అతడి సామ్రాజ్యం, ఆస్తి వివరాలు తెలిస్తే..
Saif Ali Khan`s Networth

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ముంబైలో ఓ దుండగుడి చేతిలో కత్తి పోట్లకు గురై ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. సైఫ్ అలీఖాన్ కేవలం ఓ నటుడు మాత్రమే కాదు.. ఘనమైన చరిత్ర కలిగిన రాజకుటుంబానికి వారుసుడ. హైప్రొఫైల్ నేపథ్యం. సైఫ్ తల్లిదండ్రులిద్దరూ సెలబ్రిటీలు. ఆయన తండ్రి మన్సూర్ అలీఖాన్ పటౌడి టీమిండియా క్రికెటర్, తల్లి షర్మిలా టాగోర్ ప్రఖ్యాత బాలీవుడ్ నటి. ఆయన భార్య కరీనా కపూర్ (Kareena Kapoor Khan) బాలీవుడ్ హీరోయిన్. కూతురు సారా అలీఖాన్ కూడా బాలీవుడ్ హీరోయిన్ (Saif Ali Khan's Net Worth).


సైఫ్ అలీఖాన్ ఆస్తుల విలువ రూ.1300 కోట్లకు పైనే ఉంటుంది. ఆయన భార్య కరీనా కపూర్ ఆస్తుల విలువ దాదాపు రూ.500 కోట్లు. సైఫ్ అలీఖాన్‌ పూర్వీకులు పటౌడీ సంస్థానానికి అధిపతులు. సైఫ్ అలీఖాన్ తాత అయిన నవాబ్ ఇఫ్తికార్ హర్యానాలోని గుర్గావ్‌లో 10 ఎకరాల విస్తీర్ణంలో తన భార్య బేగమ్ ఆఫ్ భోపాల్ కోసం ఓ భారీ ప్యాలస్‌ను నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్యాలస్ విలువ రూ.800 కోట్ల పైమాటే. అలాగే ప్రస్తుతం సైఫ్, తన భార్య కరీనా, పిల్లలతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. బాంద్రాలో ఉన్న ఈ విలాసవంతమైన భవనం విలువ రూ.103 కోట్లు. అలాగే ముంబైలో పలు ఇతర ప్రాంతాల్లో కూడా సైఫ్‌కు భవంతులు ఉన్నాయి. అలాగే స్విట్జర్లాండ్‌లోని గస్టాడ్‌లో సైఫ్, కరీనా జంటకు రూ.33 కోట్ల విలువైన భవంతి కూడా ఉందట.


సైఫ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 12-15 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నాడు. అలాగే తన ఎండార్స్ చేస్తున్న బ్రాండ్ల ప్రమోషన్ కోసం రూ.1.5-2 కోట్ల వరకు తీసుకుంటాడు. అలాగే సైఫ్‌కు స్వంతంగా క్లాతింగ్ బ్రాండ్ కూడా ఉంది. 2018లో బ్రాండెడ్ దుస్తుల కలెక్షన్‌ను ప్రారంభించాడు. తర్వాత దానిని ఫుట్‌వేర్, పెర్ఫ్యూమ్స్, హోమ్ డెకార్ రకంగాలకు కూడా విస్తరించాడు. ఈ బ్రాండ్‌కు బెంగళూరు, ముంబై, గోవాలలో ఔట్‌లెట్‌లు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 16 , 2025 | 02:36 PM