Share News

Saif Ali Khan: సైఫ్‌పై దాడిలో అండర్‌వరల్డ్‌ హస్తం లేదు

ABN , Publish Date - Jan 18 , 2025 | 05:15 AM

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై జరిగిన దాడి వెనుక అండర్‌వరల్డ్‌ గ్యాంగ్‌ హస్తం లేదని.. మహారాష్ట్ర మంత్రి యోగేశ్‌ కదమ్‌ అన్నారు.

Saif Ali Khan: సైఫ్‌పై దాడిలో అండర్‌వరల్డ్‌ హస్తం లేదు

మహారాష్ట్ర మంత్రి యోగేశ్‌ కదమ్‌ స్పష్టీకరణ

ముంబై, జనవరి 17: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై జరిగిన దాడి వెనుక అండర్‌వరల్డ్‌ గ్యాంగ్‌ హస్తం లేదని.. మహారాష్ట్ర మంత్రి యోగేశ్‌ కదమ్‌ అన్నారు. సీసీటీవీ ఫుటేజీ వీడియోల ఆధారంగా.. అనుమానితుడి ముఖకవళికలున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, మరొక వ్యక్తిని కూడా పోలీసులు ట్రాక్‌ చేస్తున్నారని మంత్రి తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తికిక్రిమినల్‌ రికార్డు ఉందని వెల్లడించారు. ఈ దాడి వెనుక నేరముఠాల పాత్ర ఏమైనా ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదని ప్రాథమిక విచారణలో తేలిందని, నిందితుడు చోరీ చేసే ఉద్దేశంతోనే వచ్చినట్టు కనిపిస్తోందని బదులిచ్చారు. తనకు ముప్పు ఉన్నట్టుగా సైఫ్‌ నుంచి పోలీసులకు ఇప్పటిదాకా సమాచారమేదీ లేదని.. ఆయన ఎలాంటి సెక్యూరిటీ కోరలేదని, ఒకవేళ కోరితే నిబంధనల మేరకు వ్యవహరిస్తామని ఆయన వెల్లడించారు. కాగా, సైఫ్‌పై దాడి జరిగిన ఫ్లాట్‌ వద్ద అసలు నిఘా కెమెరాలేవీ లేవని పోలీసు వర్గాల సమాచారం. అపార్ట్‌మెంట్‌ భవనంలో అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీ ద్వారానే అనుమానితుణ్ని గుర్తించారు.

Updated Date - Jan 18 , 2025 | 05:15 AM