Share News

Peace Talks: భారత్‌ పాక్‌లు చర్చించుకోవాలి

ABN , Publish Date - May 18 , 2025 | 05:36 AM

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య చర్చలు జరపాలని రష్యా పిలుపునిచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగిస్తూ, వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.

Peace Talks: భారత్‌ పాక్‌లు చర్చించుకోవాలి

రష్యా సూచన

న్యూఢిల్లీ, మే 17: సమస్యల పరిష్కారానికి భారత్‌,పాకిస్థాన్‌లు చర్చలు జరుపుకోవాలని రష్యా సూచించింది. ఇప్పటికే అమెరికా, చైనాలు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా తాజాగా ఆ జాబితాలో రష్యా చేరింది. సరిహద్దుల్లో మిలటరీ చర్యల నిలుపుదల, కాల్పుల విరమణకు ఈ నెల పదో తేదీన కుదిరిన ఒప్పందం స్ఫూర్తిని కొనసాగించాలని తెలిపింది. ఘర్షణలు పునరావృతం కాకుండా విభేదాలను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని, రాజకీయ అంగీకారానికి రావాలని పేర్కొంది. మాస్కోలో రష్యా విదేశాంగ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్‌-పాక్‌ల మధ్య తలెత్తిన ఘర్షణ, అనంతరం కుదిరిన కాల్పుల ఒప్పందంపై రష్యా వైఖరి ఏమిటంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. చర్చలను పునఃప్రారంభించాలని అన్నారు


ఇవి కూడా చదవండి..

Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 18 , 2025 | 05:36 AM