Mohan Bhagwat : హిందూ మతమే బాధ్యతాయుత సమాజం
ABN , Publish Date - Feb 17 , 2025 | 05:26 AM
హిందూ సమాజాన్ని ఐకమత్యంగా ఉంచాల్సిన ఆవశ్యకత ఉందని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ అన్నారు. ఎందుకంటే దేశంలో బాధ్యతాయుతమైన సమాజం అదొక్కటేనని చెప్పారు. భిన్నత్వాన్నే ఏకత్వంగా

భిన్నత్వాన్ని ఆమోదించేదీ అదే: మోహన్ భాగవత్
బర్ధమాన్, ఫిబ్రవరి 16: హిందూ సమాజాన్ని ఐకమత్యంగా ఉంచాల్సిన ఆవశ్యకత ఉందని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ అన్నారు. ఎందుకంటే దేశంలో బాధ్యతాయుతమైన సమాజం అదొక్కటేనని చెప్పారు. భిన్నత్వాన్నే ఏకత్వంగా భావించేది కూడా అదేనని తెలిపారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఆరెస్సెస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ..ి భిన్నత్వాన్ని స్వీకరించడమనే పునాదిపైనే హిందూ సమాజం ఆధారపడి ఉందని తెలిపారు. భిన్నతంలో ఏకత్వమని కాకుండా భిన్నత్వమే ఏకత్వమని హిందూ సమాజం నమ్ముతోందని వివరించారు.