Ropeways : 18 ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రోప్ వేలు
ABN , Publish Date - Jan 28 , 2025 | 06:23 AM
దేశంలోని 18 ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రోప్ వే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో శబరిమలలోని అయ్యప్ప ఆలయం కూడా ఉంది. పంబ నుంచి శబరిమల లోని
న్యూఢిల్లీ, జనవరి 27: దేశంలోని 18 ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రోప్ వే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో శబరిమలలోని అయ్యప్ప ఆలయం కూడా ఉంది. పంబ నుంచి శబరిమల లోని సన్నిధానం వరకు 2.62 కిలోమీటర్ల పొడవున రోప్‌వే నిర్మిస్తారు. అలాగే జమ్మూకశ్మీర్‌లోని బాల్టాల్ నుంచి అమర్‌నాథ్ వరకు 11.6 కిలోమీటర్ల మేర రోప్ వే నిర్మిస్తారు. తమిళనాడులోని పర్వాద్ మలై ఆలయం వద్ద 3.21 కిలోమీటర్లు, హిమాచల్ ప్రదేశ్‌లోని చాముండిదేవి క్షేత్రం వద్ద 6.5 కిలోమీటర్ల రోప్‌వే నిర్మిస్తారు. మొత్తం 18 రోప్‌వే ప్రాజెక్టులకు సంబంధించి తగిన డిజైన్లతో రావాలని కేంద్రం కన్సల్టంట్లను ఆహ్వానించింది.