IT professionals: ఐటీ బ్రదర్.. ఫ్యాటీ లివర్!
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:08 AM
దేశ వ్యాప్తంగా 54 లక్షల మంది ఐటీ రంగంలో పని చేస్తుండగా.. వారిలో 80 శాతం మందికి పైగా ఫ్యాటీ లివర్ సహా పలు కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

దేశంలోని 80% మంది ఐటీ ఉద్యోగులు ఫ్యాటీ లివర్ బాధితులే
ఏఐజీ వైద్యులు, హెచ్‌సీయూ రిసెర్చ్ స్కాలర్ల అధ్యయనంలో వెల్లడి
చిరుతిండ్లు, నిద్రలేమి, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణాలు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారిలో కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 54 లక్షల మంది ఐటీ రంగంలో పని చేస్తుండగా.. వారిలో 80 శాతం మందికి పైగా ఫ్యాటీ లివర్ సహా పలు కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాక, 71 శాతం మంది ఐటీ ఉద్యోగుల్లో ఊబకాయం సమస్య ఉండగా, 34 శాతం మంది ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు, మధుమేహం తదితర సమస్యల బారిన పడే ప్రమాదంలో ఉన్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి హెపటాలజిస్ట్ డాక్టర్ పీఎన్ రావు బృందం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)కి రిసెర్చ్ స్కాలర్ల బృందం సంయుక్తంగా చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధిక పని గంటలు, ఒత్తిడి, రకరకాల పని వేళలు, ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోని ఉండడం వంటివి కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని పరిశోధకులు తెలిపారు. అంతేకాక, నిద్రలేమి, అనారోగ్యకరమైన చిరుతిళ్లు, శారీరక శ్రమ లేకపోవడం కూడా సమస్యకు కారణాలని పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ మెడిసన్ ప్రొఫెసర్లు కల్యాణ్కర్ మహదేవ్, అనిత, రీసెర్చ్ స్కాలర్లు బారం భార్గవ, నందితా ప్రమోద్ పాల్గొన్నారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ
For National News And Telugu News