Dr Ekhnath Chitnis: ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:20 AM
భారత అంతరిక్ష పరిశోధన రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ శాస్త్రవేత్త, పద్మ భూషణ్ గ్రహీత డాక్టర్ ఏక్‌నాథ్ వసంత్
ఏక్‌నాథ్ చిట్నిస్ కన్నుమూత
పుణె, అక్టోబరు 22: భారత అంతరిక్ష పరిశోధన రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ శాస్త్రవేత్త, పద్మ భూషణ్ గ్రహీత డాక్టర్ ఏక్‌నాథ్ వసంత్ చిట్నిస్ (100) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చిట్నిస్, బుధవారం నాడు గుండెపోటు రావడంతో పుణెలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ చివరి సహచరులలో చిట్నిస్ ఒకరు. ప్రస్తుతం ఇస్రోగా రూపాంతరం చెందిన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ తొలి నాళ్లలో ఆయన కీలకమైన పాత్ర పోషించారు. భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ప్రయోగ కేంద్రం కోసం కేరళలోని తుంబాను ఎంపిక చేయడంలో కూడా చిట్నిస్ కీలకంగా వ్యవహరించారు. అప్పటి యువ శాస్త్రవత్త అబ్దుల్‌కలాంకు మార్గనిర్దేశం చేశారు.