India Defense: దేశీయ రక్షణ ఉత్పత్తుల రికార్డు
ABN , Publish Date - Aug 10 , 2025 | 02:48 AM
దేశీయ రక్షణరంగ ఉత్పత్తులు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2024 25 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రక్షణ
2024-25లో రూ. 1.51 లక్షల కోట్లకు ఉత్పత్తులు: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశీయ రక్షణరంగ ఉత్పత్తులు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రక్షణ ఉత్పత్తులు రూ. 1,50,590 కోట్లకు చేరి ఆల్‌టైం అత్యధిక రికార్డును నమోదు చేశాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం తెలిపా టరు. ఇది అంతక్రితం ఏడాది కంటే 18ు అధికం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఉత్పత్తులు రూ.1.27 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కాగా 2019-20లో రూ. 79,071 కోట్లుగా ఉన్న ఉత్పత్తులు ఆ తర్వాత రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. ఆ ఏడాది నుంచి చూస్తే ప్రస్తుతం 90ు అధికం. మొత్తం ఉత్పత్తుల్లో ఢిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (డీపీఎస్‌యూ), పబ్లిక్ సెక్టార్ యూనిట్ల (పీఎ్‌సయూ) వాటా 77 శాతంగా ఉంది. మిగిలిన 23ు ప్రైవేట్ సం స్థల భాగస్వామ్యం. ఇక 2024-25లో ప్రైవేట్ సెక్టార్ వాటా 2ు పెరిగింది. 2023-24లో అది 21 శాతంగా ఉంది. పబ్లిక్, ప్రైవేట్ సంస్థల సమష్టి సహకారంతో రక్షణరంగ ఉత్పత్తుల్లో రికార్డు నెలకొల్పగలిగామని రాజ్‌నాథ్ కొనియాడారు. రక్షణ పరిశ్రమల్లో భారత్ బలోపేతం అయిందనడానికి ఇదే స్పష్టమైన సంకేతమన్నారు. ఆత్మనిర్భర్‌లో భాగంగా ప్రభుత్వ ప్రోత్సాహంతో రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంభన సాధిస్తున్నామని ఆయన చెప్పారు. రక్షణ ఉత్పత్తుల్లో 2028-29 నాటికి రూ. 50 వేల కోట్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటామని డీఆర్‌డీవో చైర్మన్ సమీర్ వి.కామత్ ధీమా వ్యక్తం చేశారు.