Share News

RC Plasto Tanks: గోసంరక్షణకు ఆర్‌సీ ప్లాస్టో సాయం

ABN , Publish Date - May 16 , 2025 | 05:18 AM

ఆర్‌సీ ప్లాస్టో సంస్థ గోవుల సంరక్షణ కోసం గో విజ్ఞాన్ అనుసంధాన కేంద్రానికి అత్యాధునిక వెటర్నరీ అంబులెన్స్‌ను విరాళంగా అందించింది. ఆవులకు తక్షణ వైద్య సహాయం మరియు సులభమైన తరలింపుకు ఈ అంబులెన్స్ కీలకంగా ఉంటుంది.

RC Plasto Tanks: గోసంరక్షణకు ఆర్‌సీ ప్లాస్టో సాయం

  • గో విజ్ఞాన్‌ అనుసంధాన కేంద్రానికి అత్యాధునిక వెటర్నరీ అంబులెన్స్‌ విరాళం

నాగ్‌పూర్‌, మే 15 : నీటి నిర్వహణ, నిల్వకు సంబంధించిన పరికరాల తయారీలో పేరొందిన సంస్థ ఆర్‌సీ ప్లాస్టో ట్యాంక్స్‌ అండ్‌ పైప్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎ్‌సఆర్‌) కింద గోవుల సంరక్షణ కోసం నిధులు కేటాయించింది. నాగ్‌పూర్‌ జిల్లా దేవలాపర్‌లో ఉన్న గో విజ్ఞాన్‌ అనుసంధాన కేంద్రానికి అత్యాధునిక వెటర్నరీ అంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చింది. అంబులెన్స్‌ సమకూర్చుకునేందుకుగాను రూ.17 లక్షల చెక్కును గో విజ్ఞాన్‌ అనుసంధాన కేంద్రం అధ్యక్షుడు పద్మేశ్‌ గుప్తాకు ఆర్‌సీ ప్లాస్టో డైరెక్టర్‌ నీలేశ్‌ అగర్వాల్‌ అందజేశారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన, ఇతర కారణాల వల్ల జబ్బు పడిన ఆవులకు అవసరమైన వైద్య సాయం సకాలంలో అందించేందుకు ఈ అత్యాధునిక అంబులెన్స్‌ ఎంతో ఉపయోగపడనుంది. వైద్య పరికరాలు, మందులు, ఆక్సిజన్‌ సిలిండర్‌తోపాటు గాయపడిన ఆవులను సులువుగా తరలించేందుకు అవసరమైన సదుపాయాలు ఈ అంబులెన్స్‌లో ఉంటాయి.

Updated Date - May 16 , 2025 | 05:18 AM