Share News

IPS Officer: సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ డీజీగా రవి గుప్తా

ABN , Publish Date - Oct 18 , 2025 | 05:52 AM

సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌, డైరక్టర్‌ జనరల్‌గా ఐపీఎస్‌....

IPS Officer: సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ డీజీగా రవి గుప్తా

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌, డైరక్టర్‌ జనరల్‌గా ఐపీఎస్‌ రవి గుప్తాను ప్రభుత్వం నియమించింది. ఆయన రెండేళ్ల కాలానికి ఈ బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు శుక్రవారం జారీ చేశారు. రవి గుప్తా సర్వీసు ఈ ఏడాది చివరి వరకు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆయన వాలంటరీ రిటైర్మెంట్‌ను మూడు నెలల ముందుగానే ఆమోదించింది. ఇప్పటికే సీజీజీలో కొనసాగుతున్న ఆయనకు, నేటి నుంచి పూర్తి స్థాయి డైరక్టర్‌ జనరల్‌ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

Updated Date - Oct 18 , 2025 | 05:52 AM