ఆయనకు రూ.500 కోట్లు ఇవ్వండి!
ABN , Publish Date - Feb 08 , 2025 | 05:37 AM
దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన వీలునామాలో ఓ వ్యక్తికి రూ.500 కోట్లు ఇవ్వాలని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల తెరిచిన వీలునామాను చూసి ఆయన కుటుంబం, టాటా ఆంతరంగికులు ఆశ్చర్యపోయినట్టు జాతీయ మీడియాలో

రతన్ టాటా వీలునామాలో ఓ వ్యాపారవేత్త పేరు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన వీలునామాలో ఓ వ్యక్తికి రూ.500 కోట్లు ఇవ్వాలని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల తెరిచిన వీలునామాను చూసి ఆయన కుటుంబం, టాటా ఆంతరంగికులు ఆశ్చర్యపోయినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వీలునామాలో పేర్కొన్న ఆ వ్యక్తి జంషెడ్‌పూర్‌కు చెందిన ట్రావెల్ రంగ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తా. ట్రావెల్ ఏజెన్సీ స్టాలియన్‌లో దత్తా, ఆయన కుటుంబానికి 80 శాతం వాటా, మిగతాది టాటా ఇండస్ర్టీ్‌సకు ఉండేది. 2013లో టాటా గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో భాగంగా ఉన్న తాజ్ సర్వీసె్‌సలో స్టాలియన్ విలీనమైంది. రతన్ టాటాకు దత్తా నమ్మకంగా, టాటా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే రతన్ టాటా తన వీలునామాలో దత్తా పేరును చేర్చినప్పటికీ హై కోర్టు ధ్రువీకరణ తర్వాతే సంపద పంపిణీ జరుగుతుందని తెలుస్తోంది.