Share News

POCSO case: బాలికను కిడ్నాప్‌ చేసి 3 రోజులు అత్యాచారం

ABN , Publish Date - May 25 , 2025 | 05:46 AM

బెళగావి జిల్లా రాయభాగ తాలూకా రామలింగ మఠాధిపతి హఠయోగి లోకేశ్వరస్వామీజీని 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి మూడు రోజుల పాటు లాడ్జీలలో అత్యాచారం చేసిన కేసులో అరెస్టు చేశారు. పోలీసులు పోక్సో, కిడ్నాప్‌ కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

POCSO case: బాలికను కిడ్నాప్‌ చేసి 3 రోజులు అత్యాచారం

వేర్వేరు నగరాల్లోని లాడ్జీలకు తిప్పి అఘాయిత్యం

రామలింగ మఠాధిపతి హఠయోగి లోకేశ్వరస్వామీజీ అరెస్టు

బెంగళూరు, మే 24(ఆంధ్రజ్యోతి): బాలికను కిడ్నాప్‌ చేసి మూడు రోజుల పాటు లాడ్జీలకు తిప్పి అత్యాచారానికి పాల్పడిన కేసులో బెళగావి జిల్లా రాయభాగ తాలూకా మేకళి గ్రామంలోని రామలింగ మఠాధిపతి హఠయోగి లోకేశ్వరస్వామీజీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై పోక్సో, కిడ్నాప్‌ కేసులు నమోదు చేసినట్టు బెళగావి జిల్లా ఎస్పీ డాక్టర్‌ బీమాశంకర్‌ గుళేద చెప్పారు. ఆయన తెలిపిన వివరాల మేరకు పీయూ ప్రథమ సంవత్సరం విద్యార్థిని(17) అనారోగ్యం నేపథ్యంలో రామలింగ మఠాన్ని ఆశ్రయించింది. ఆ మఠాధిపతి హఠయోగి లోకేశ్వరస్వామిజీపై ఆమెకు నమ్మకం, భక్తిభావం ఏర్పడ్డాయి. ఈ నెల 13న తన మేనమామ ఊరికి వెళ్లిన బాలిక కాలి నడకన తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అటుగా కారులో వచ్చిన స్వామీజీ డ్రాప్‌ చేస్తానంటూ కారులో ఎక్కించుకున్నాడు. కారు తమ గ్రామం మీదుగానే వెళ్తుందని తెలిసి బాలిక కారులో ఎక్కింది. అయితే, కారును ఆ గ్రామంలో ఆపకుండా స్వామీజీ బాలికను బెదిరించి రాయచూరుకు తీసుకువెళ్లాడు. అక్కడి ఓ లాడ్జిలో రెండు రోజులపాటు ఉంచి అత్యాచారం చేశాడు. అనంతరం ఈ నెల 15న బాగల్కోటెకు తీసుకెళ్లి, అక్కడి ఓ లాడ్జిలో ఉంచి అత్యాచారం చేశాడు. ఇంటికి వెళతానని బాలిక ఏడవడంతో ఈ నెల 16న మహాలింగపుర బస్టాండ్‌లో వదిలేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం బాలిక ఇంటికి చేరుకొని జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. ఈ నెల 21న బాగల్కోటె మహిళా పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసును మూడలిగె పోలీ్‌సస్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో స్వామీజీని గురువారం అరెస్టు చేసి, శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు.


ఇవి కూడా చదవండి

Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..

Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..

Updated Date - May 25 , 2025 | 05:46 AM