Share News

Raja Raghuvanshi Case: రాజాను చంపి.. అతడి అంత్యక్రియల్లోనే అదిరిపోయే యాక్టింగ్..

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:49 PM

Raja Raghuvanshi Case: సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహ ఆమె తండ్రి దగ్గర పనిచేసేవాడు. ఆ సమయంలోనే సోనమ్, రాజ్‌లకు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

Raja Raghuvanshi Case: రాజాను చంపి.. అతడి అంత్యక్రియల్లోనే అదిరిపోయే యాక్టింగ్..
Raja Raghuvanshi Case

రాజా రఘువంశీ మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. మతిపోగొట్టే విషయాలు బయటపడుతున్నాయి. భర్తను హత్య చేయించిందన్న కారణంతో ఇప్పటికే సోనమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు హత్యలో భాగమైన నలుగురు యువకుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహ కూడా ఉన్నాడు. రాజా చెల్లెలు శ్రేష్టి రఘువంశ్.. రాజ్ కుశ్వాహకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా, తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. రాజా అంత్యక్రియల్లో రాజ్ పాల్గొన్న వీడియో అది.


బాధలో ఉన్న సోనమ్ తండ్రిని రాజ్ పట్టుకుని నడుస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. ఇక ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘రాజాను చంపేసి అతడి అంత్యక్రియల్లోనే పాల్గొన్నాడు. ఇది మామూలుగా లేదు’..‘ అబ్బా కమల్ హాసన్ ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావా. నీలాంటోళ్లు సినిమాల్లోకి రావాలి’..‘సోనమ్ తండ్రి కూడా తప్పు చేశాడు. అతడికి అంతా తెలుసు’..‘మొత్తం సోనమ్ ఫ్యామిలీకి ఈ దారుణంలో భాగం ఉన్నట్లు అనిపిస్తోంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ప్రియుడికి ఇచ్చిన మాట కోసం

సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహ సోనమ్ తండ్రి దగ్గర పనిచేసేవాడు. ఆ సమయంలోనే సోనమ్, రాజ్‌లకు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రాజ్‌ను ప్రేమిస్తున్న సంగతి సోనమ్ తన తండ్రికి చెప్పలేదు. అతడితో పెళ్లికి తండ్రి ఒప్పుకోడని భావించింది. ముందుగా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని, అతడ్ని చంపేయాలని అనుకుంది. భర్త చనిపోయిన తనను రాజ్ పెళ్లి చేసుకోవడానికి తండ్రి ఒప్పుకుంటాడని అనుకుంది. ఈ నేపథ్యంలోనే పెళ్లైన 20 రోజులకే రాజాను దగ్గరుండి మరీ చంపించింది.


ఇవి కూడా చదవండి

పెళ్లికి ముందే ప్లాన్.. ప్రియుడికి ఇచ్చిన మాట కోసం దారుణం..

నాకు డ్రగ్స్ ఇచ్చారు.. పోలీసుల విచారణలో సోనమ్..

Updated Date - Jun 10 , 2025 | 12:57 PM