Share News

Rahul Gandhi: ఓటు చోరీకి భారీ స్పందన

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:08 AM

దేశవ్యాప్తంగా ఓట్ల చోరీకి నిరసనగా చేపట్టిన పోరాటానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందని రాహుల్‌గాంధీ తెలిపారు.

Rahul Gandhi: ఓటు చోరీకి భారీ స్పందన

  • 15 లక్షల మంది రిజిస్టర్‌.. 10 లక్షల మిస్డ్‌ కాల్స్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 11: దేశవ్యాప్తంగా ఓట్ల చోరీకి నిరసనగా చేపట్టిన పోరాటానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందని రాహుల్‌గాంధీ తెలిపారు. ‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా తాము ప్రారంభించిన వెబ్‌పోర్టల్‌లో ఇప్పటికే 15లక్షల మందికి పైగా రిజస్టర్‌ అయ్యారని, 10 లక్షలకు పైగా మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయని పేర్కొన్నారు. ఈ ఉద్య మం మహోద్యమంగా మారిందని ‘ఎక్స్‌’లో రాహుల్‌ పోస్ట్‌ చేశారు. ‘‘దేశంలో నిజమైన ప్రజాస్వామ్యానికి ఇది నిదర్శనం. అణచివేతకు గురైన గొంతుకలు మా ఉద్య మం ద్వారా ఎలుగెత్తుతున్నాయి’’ అని రాహుల్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఓట్ల చౌర్యం వ్యవహారంలో పార్టీ అగ్రనేత రాహుల్‌ ఓ వైపు పోరాటం చేస్తుండగా, ‘ఎన్నికలప్పుడు కళ్లు మూసుకున్నారా..?’ అని కర్ణాటక మంత్రి రాజణ్ణ చేసిన వ్యాఖ్యలు ఆయన పదవికి ఎసరు తెచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో సీఎం సిద్దరామయ్య ఆయనను పదవి నుంచి తప్పించారు.

Updated Date - Aug 12 , 2025 | 04:08 AM