Share News

Rahul Gandhi: రాజ్యాంగ రక్షణ పోరాటంలో భాగంగానే జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఎంపిక: రాహుల్‌

ABN , Publish Date - Aug 21 , 2025 | 05:13 AM

ఉపరాష్ట్రపతి పదవికి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంచుకోవడం రాజ్యాంగాన్ని రక్షించేందుకు జరుగుతున్న పోరాటమేనని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు.

Rahul Gandhi: రాజ్యాంగ రక్షణ పోరాటంలో భాగంగానే జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఎంపిక: రాహుల్‌

  • సుదర్శన్‌రెడ్డికి ఇండీ కూటమి సన్మానం.. నేడు నామినేషన్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి పదవికి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంచుకోవడం రాజ్యాంగాన్ని రక్షించేందుకు జరుగుతున్న పోరాటమేనని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఐదు దశాబ్దాలకుపైగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నారని తెలిపారు.


ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రతిపక్షాలు నిర్ణయించిన జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని బుధవారం ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో సత్కరించారు. రాజ్యాంగ పరిరక్షణ బాఽధ్యత, రాజ్యాంగ విలువలపై సుదర్శన్‌రెడ్డి సుమారు అరగంట సేపు చేసిన ప్రసంగం సభ్యులను ఆకట్టుకుంది. కాగా ఆయన గురువారం ఉదయం 11 గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

Updated Date - Aug 21 , 2025 | 05:13 AM