Share News

Rahul Gandhi: అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం

ABN , Publish Date - Nov 05 , 2025 | 05:24 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరో వివాదానికి తెర తీశారు. బిహార్‌లోని ఔరంగాబాద్‌లో మంగళవారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ....

Rahul Gandhi: అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం

  • 10 శాతం ఉన్న వారే సైన్యాన్నీ నియంత్రిస్తున్నారు

  • ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, నవంబరు 4 : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరో వివాదానికి తెర తీశారు. బిహార్‌లోని ఔరంగాబాద్‌లో మంగళవారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. దేశ జనాభాలో ఉన్నవారి(అగ్రవర్ణాలు) గుప్పిట్లో సైన్యం ఉందని వ్యాఖ్యానించారు. వారికే కార్పొరేట్‌ రంగం, బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థలో అవకాశాలు దక్కుతున్నాయని, ఆఖరికి సైన్యాన్ని కూడా వారే నియంత్రిస్తున్నారని వ్యాఖ్యానించారు. జనాభాలో 90 శాతం ఉన్న వెనుకబడిన వర్గాలు, దళితులు, షెడ్యూలు తెగలు, మైనారిటీలు వీటిలో ఎక్కడా కనిపించరని చెప్పారు. కుల గణనతోనే ఈ వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రాహుల్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ తొలిసారిగా సైన్యాన్ని ఉద్దేశించి కుల ప్రస్తావన తెస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలోనూ సైన్యంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గత ఆగస్టు నెలలో అరుణాచల్‌ప్రదేశ్‌లో మన సైనికులను చైనా సైనికులు తరిమేసి 2000 చదరపు కి.మీ. భూభాగం ఆక్రమించారని వ్యాఖ్యానించి సుప్రీంకోర్టు నుంచి చీవాట్లు తిన్నారు. కాగా దేశ యువత రీల్స్‌ చేస్తూ కాలం గడిపేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని బిహార్‌లోని ఔరంగాబాద్‌, గయాజిలలో నిర్వహించిన బహిరంగసభల్లో రాహుల్‌ వ్యాఖ్యానించారు. చదువు, ఉద్యోగాల గురించి యువత ప్రశ్నించకుండా వారు సోషల్‌ మీడియాలో మునిగిపోవాలని మోదీ కోరుకుంటున్నారన్నారు. మరో బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రధానిది నకిలీ డిగ్రీ అని ఆరోపించారు.

Updated Date - Nov 05 , 2025 | 05:24 AM