Share News

Rahul Hindenburg Ties: హిండెన్‌బర్గ్‌తో రాహుల్‌కు సంబంధాలు

ABN , Publish Date - Apr 25 , 2025 | 05:12 AM

ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ ఆధారాలు సేకరించి, హిందెన్‌బర్గ్‌ రీసెర్చ్‌తో రాహుల్‌ గాంధీకి సంబంధాలు ఉన్నాయని స్పుత్నిక్‌ ఇండియా పేర్కొంది. ఈ కథనంతో అదానీ గ్రూప్‌, ప్రధాని మోదీపై అణగదొక్కాలనే లక్ష్యంతో రాహుల్‌ హిందెన్‌బర్గ్‌తో సహకరించాడని వెల్లడించింది

Rahul Hindenburg Ties: హిండెన్‌బర్గ్‌తో రాహుల్‌కు సంబంధాలు

  • అదానీ-మోదీలే లక్ష్యంగా సహకారం

  • మొస్సాద్‌ ఆపరేషన్‌లో బహిర్గతమైందన్న స్పుత్నిక్‌ ఇండియా..

  • ఆ నివేదికను ఉటంకిస్తూ ‘మనీకంట్రోల్‌’ కథనం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: అదానీ గ్రూప్‌పై గతంలో సంచలన ఆరోపణలు చేసిన అమెరికా షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌తో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి సంబంధాలపై ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ ఆధారాలు సేకరించిందని స్పుత్నిక్‌ ఇండియా పేర్కొంది. రాహుల్‌ సన్నిహితుడు, ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ శ్యామ్‌ పిట్రోడా హోం సర్వర్లను లక్ష్యంగా చేసుకొని మొస్సాద్‌ ఓ రహస్య ఆపరేషన్‌ నిర్వహించినట్లు తన నివేదికలో వెల్లడించింది. అదానీ, ప్రధాని మోదీలను అణగదొక్కాలనే లక్ష్యంతో రాహుల్‌ హిండెన్‌బర్గ్‌తో సంబంధాలు పెట్టుకున్నట్లు బహిర్గతమైనట్లు వివరించింది. వ్యాపార వార్తలను అందించే ప్రముఖ వెబ్‌సైట్‌ ‘మనీకంట్రోల్‌’ తన కథనంలో ఈ విషయాల్ని వెల్లడించింది. అలాగే వీటిని తాము ధ్రువీకరించట్లేదని కూడా స్పష్టం చేసింది. కాగా, అదానీ గ్రూప్‌ తన షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని, అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడిందంటూ 2023 జనవరిలో హిండెన్‌బర్గ్‌ విడుదల చేసిన నివేదిక సంచలనం రేపిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Updated Date - Apr 25 , 2025 | 05:12 AM