13న ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ
ABN , Publish Date - Feb 08 , 2025 | 06:38 AM
ప్రధాని మోదీ అమెరికా, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లనున్నారు. 4రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 10న పారిస్ చేరుకుంటారు. అక్కడ జరిగే కృత్రిమ మేధ సదస్సుకు ఫ్రాన్స్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రధాని మోదీ అమెరికా, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లనున్నారు. 4రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 10న పారిస్ చేరుకుంటారు. అక్కడ జరిగే కృత్రిమ మేధ సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి మోదీ అధ్యక్షత వహిస్తారు. అనంతరం కెడరాచీలోని అంతర్జాతీయ ఽథర్మల్ న్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్‌ను పరిశీలిస్తారు. 12న వాషింగ్టన్ డీసీకి వెళ్తారు. 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అవుతారు.