Share News

Sunita Williams : ఆ వ్యోమగాములను వెనక్కి తీసుకురండి

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:21 AM

అంతరిక్షంలో ఇరుక్కుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌లను తిరిగి భూమికి తీసుకురావాలని స్పేస్‌ ఎక్స్‌ను, దాని అధినేత ఎలాన్‌ మస్క్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కోరారు. మస్క్‌

Sunita Williams : ఆ వ్యోమగాములను వెనక్కి తీసుకురండి

ఐఎస్‌ఎస్‌ నుంచి సునీత, విల్‌మోర్‌ను తీసుకురావాలని మస్క్‌కు ట్రంప్‌ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జనవరి 29: అంతరిక్షంలో ఇరుక్కుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌లను తిరిగి భూమికి తీసుకురావాలని స్పేస్‌ ఎక్స్‌ను, దాని అధినేత ఎలాన్‌ మస్క్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కోరారు. మస్క్‌ ఈ పనిని త్వరలోనే పూర్తి చేస్తారని ట్రంప్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. ట్రంప్‌ పోస్ట్‌ను షేర్‌ చేస్తూ త్వరలోనే ఆ పనిని పూర్తి చేస్తామని ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. వ్యోమగాములను అంతరిక్షం నుంచి తీసుకొచ్చే విషయంలో గత బైడెన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహిరించిందని మస్క్‌ ఆరోపించారు. వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌లో గతేడాది జూన్‌లో 8 రోజుల మిషన్‌ లో భాగంగా అంతరిక్ష కేంద్రా(ఐఎ్‌సఎ్‌స)నికి వెళ్లారు. అయితే వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురై అనుకున్న సమయానికి వారు తిరిగి రావడం వీలుకాలేదు. వారు 7 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయి ఉన్నారు. ఏడునెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోవడంతో సునీత నడవడం మర్చిపోయినట్లు తెలుస్తోంది. సోమవారం ఆమె అంతరిక్షం నుంచే కొందరు విద్యార్థులతో మాట్లాడారు. ‘‘నేను చాలా కాలంగా అంతరిక్షంలో ఉంటున్నాను ఇక్కడ నడవడానికి లేదు. కూర్చోవడానికి, పడుకోవడానికి వీలులేదు. ప్రస్తుతం నేను నడవడాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను’’ అన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 04:21 AM