పేపర్ లీక్ నిరసనలతో జైలుకు ప్రశాంత్ కిశోర్
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:25 AM
బిహార్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (బీపీఎస్సీ) నిర్వహించిన పరీక్షా పేపరు లీక్ అయిన వ్యవహారంపై ఆందోళన చేస్తున్న ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు,

పట్నా, జనవరి 6: బిహార్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (బీపీఎస్సీ) నిర్వహించిన పరీక్షా పేపరు లీక్ అయిన వ్యవహారంపై ఆందోళన చేస్తున్న ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్‌ను పట్నాలో పోలీసులు అరెస్టుచేశారు. షరతులతో కూడిన బెయిల్‌ను తీసుకునేందుకు నిరాకరించడంతో ఆయనను జైలుకు తరలించారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన పరీక్షా పేపరు గత ఏడాది డిసెంబరు 13న లీకైన విషయం తెలిసిందే. దీనిపై బిహార్‌లో తీవ్ర రాజకీయ నిరసనలు కొనసాగుతున్నాయి. బీపీఎస్సీ పరీక్షలను రద్దుచేయాలంటూ బాధిత అభ్యర్థులు, ప్రతిపక్షాలు ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ తన మద్దతుదారులతో కలిసి ఐదు రోజులుగా పట్నాలోని గాంధీ మైదానంలో నిరశన దీక్ష చేస్తున్నారు. అయితే, నిషిద్ధ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా దీక్ష చేపడుతున్నారంటూ సోమవారం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అడ్డుకోబోయిన 43 మంది మద్దతుదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు.