Goa Nuclear Plant: గోవాలో అణువిద్యుత్ ప్లాంటుపై రగడ
ABN , Publish Date - May 14 , 2025 | 05:46 AM
గోవాలో అణు విద్యుత్ ప్లాంటు ఏర్పాటుపై బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య ఘర్షణ చెలరేగింది. ప్రత్యామ్నాయం లేకే ఈ ప్రతిపాదనపై పరిశీలన చేస్తున్నామని కేంద్ర మంత్రి ఖట్టర్ వెల్లడించారు.
పనాజీ, మే 13: గోవాలో అణు విద్యుత్ ప్లాంటు ఏర్పాటుపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య వివాదం రాజుకుంది. కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి మనోహర్ ఖట్టర్ ఈ అంశంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్, మంత్రులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మరో ప్రత్యామ్నాయం లేకనే గోవాలో అణు విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు పరిశీలన జరుపుతున్నామన్నారు. ఈ ప్రతిపాదనను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ పట్కర్ చెప్పారు. ఆప్ గోవా అధ్యక్షుడు అమిత్ పాలేకర్ కూడా ప్లాంటు ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..