Share News

PMK: రాష్ట్రంలో కులగణన జరపాల్సిందే..

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:15 PM

రాష్ట్రంలో కులగణన జరపాల్సిందేనని పీఎంకే పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి డిమాండ్‌ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం అమలుపరుస్తున్న 69శాతం రిజర్వేషన్లకు నష్టం వాటిల్లే అవకాశముందన్నారు.

PMK: రాష్ట్రంలో కులగణన జరపాల్సిందే..

- పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి

చెన్నై: రాష్ట్రంలో తక్షణం కులగణన జరపాలని పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి(Dr. Anbumani) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో దేశవ్యాప్తంగా 2027 మార్చి 1వ తేదీ నుండి జనగణన చేపట్టనున్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపిందని, జనగణనతో పాటే కులగణన కూడా చేపట్టనున్నట్లు ప్రకటించిందని, అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణనలో ఆర్థిక, విద్యాపరంగా వెనకబడిన ప్రజల వివరాలు పూర్తిగా బయటికి రావన్నారు.


nani4.jpg

రాష్ట్రంలో ప్రస్తుతం అమలుపరుస్తున్న 69శాతం రిజర్వేషన్లకు నష్టం వాటిల్లే అవకాశముందని, రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులు ఏ నిమిషంలోనైనా విచారణకు వస్తాయని, ఆలోపు రాష్ట్రంలో కులగణనను పూర్తిచేయాలని అన్బుమణి డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు..

బనకచర్లపై ఉత్తమ్‌, కవిత తప్పుడు ప్రచారం: బక్కని

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2025 | 12:15 PM