PM Modi: నేడు ఒకేసారి 51వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు.. ఇవ్వనున్న ప్రధాని
ABN , Publish Date - Jul 12 , 2025 | 06:00 AM
కేంద్రప్రభుత్వంలోని వివిధ విభాగాలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన 51 వేల మందికి శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నియమాక పత్రాలను అందజేయనున్నారు.
న్యూఢిల్లీ, జూలై 11(ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వంలోని వివిధ విభాగాలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన 51 వేల మందికి శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నియమాక పత్రాలను అందజేయనున్నారు. ‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా జరిగే కార్యక్రమంలో వీటిని అందిస్తారు.
కేంద్రం ఇప్పటివరకు 15 ‘రోజ్‌గార్ మేళా’లను నిర్వహించి 10లక్షలకు పైగా నియామకపత్రాలను అందజేసింది. తాజాగా 16వ ‘రోజ్‌గార్ మేళా’ను దేశవ్యాప్తంగా 47 చోట్ల నిర్వహించనుంది. రైల్వే, హోం, తపాలా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఆర్థిక సేవల విభాగం, కార్మిక, ఉపాధికల్పన శాఖలతో పాటు ఇతర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు కల్పించనుంది.