PM Modi: బానిస మనస్తత్వంతో హిందువులపై దాడి
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:03 AM
బానిస మనస్తత్వం ఉన్నవారు హిందూమత విశ్వాసాలపై అదే పనిగా దాడిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

హిందూ మత విశ్వాసాలపై అదేపనిగా విమర్శలు
విభజన, విచ్ఛిన్నమే వారి అజెండా
విదేశీ శక్తుల దన్నుతో భారత్‌ను బలహీనపరిచే యత్నం
కుంభమేళా విమర్శకులపై మోదీ ఫైర్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాను విమర్శిస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. బానిస మనస్తత్వం ఉన్నవారు హిందూమత విశ్వాసాలపై అదే పనిగా దాడిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓ వర్గం నేతలు హిందూమతాన్ని అవహేళన చేస్తున్నారని, విదేశాల దన్నుతో దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్నారని మండిపడ్డారు. మహాకుంభమేళా నిర్వహణ ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తోందన్నారు.
ఇది భావి తరాలకు ఐక్యతాచిహ్నంగా నిలుస్తుందని తెలిపారు. ‘హిందూ విశ్వాసాన్ని ద్వేషించేవారు శతాబ్దాలుగా అక్కడక్కడా ఉంటూనే ఉన్నారు. వీరికి మద్దతివ్వడం డ్వారా విదేశీ శక్తులు కూడా మన దేశాన్ని, మతాన్ని బలహీనపరచాలని చూస్తున్నాయి. సమాజాన్ని విభజించి ఐక్యతను బద్దలు కొట్టడమే వారి ఎజెండా’ అని మోదీ విమర్శించారు. కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై మమత, అఖిలేశ్, ఖర్గే విమర్శలు చేసిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మహాకుంభమేళాను విజయవంతం చేయడంలో పారిశుద్ధ కార్మికులు, పోలీసుల కృషి ఎనలేనిదన్నారు. వేల మంది వైద్యులు, వలంటీర్లు అంకిత భావంతో, సేవాస్ఫూర్తితో పనిచేస్తున్నారని కొనియాడారు.
ఇవి కూడా చదవండి...
CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన
Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన
PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.