Share News

NDA Meeting: రూ.555 కోట్లతో గిరిజన ఆవాసాలకు రోడ్లు

ABN , Publish Date - May 26 , 2025 | 03:20 AM

ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా భారత శక్తిని ప్రపంచానికి చాటారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పీఎం జన్‌మన్‌ పథకంలో భాగంగా ఏపీలో ఆదివాసీలకు రహదారులు, ఎస్సీల వర్గీకరణకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు.

NDA Meeting: రూ.555 కోట్లతో గిరిజన ఆవాసాలకు రోడ్లు

పీఎం జన్‌మన్‌ పథకంలో భాగంగా నిర్మాణం

కుల గణనతో అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి

ఎన్డీయే సీఎంలు, ఉపముఖ్యమంత్రుల సదస్సులో

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

న్యూఢిల్లీ, మే 25(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రధాని మోదీ ప్రపంచానికి చాటిచెప్పారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘కేంద్రం నిధులు సమకూరుస్తున్న పీఎం జన్‌మన్‌ కార్యక్రమం ద్వారా ఏపీలో రూ.555.61 కోట్ల నిధులతో ఏడు జిల్లాల్లోని 239 పీవీటీజీ ఆవాసాలకు 612.72 కి.మీ. మేర రహదారులు నిర్మిస్తున్నాం. దీనివల్ల సుమారు 50వేల మందికి రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఒక్కరికీ, అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో ప్రధాని చర్యలు తీసుకుంటున్నారు. ఆ స్ఫూర్తితోనే ఎన్డీఏ పాలిత రాష్ర్టాలు ముందుకు వెళ్తున్నాయి. ఏపీలో ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌ 3నెలల పాటు రాష్ట్రంలో పర్యటించి రూపొందించిన నివేదిక ప్రకారం వర్గీకరణ చేపట్టాం. కుల గణన చేపట్టడం ద్వారా దేశంలో ఉన్న కులాల పరిస్థితులు, వారి జీవనం, వృత్తులు, స్థితిగతులు తెలుస్తాయి. వారి జీవనోపాధుల మెరుగుదలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఏ పథకాలు అమలు చేయాలో ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది’ అని పవన్‌ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

Minister Satyakumar: 2047 నాటికి ప్ర‌పంచంలో రెండో స్థానానికి భార‌త్ ఎద‌గ‌డం ఖాయం

Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..

Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్‌, దాని నీచమైన నిర్వాహకుడు పాక్‌.. నిప్పులు చెరిగిన అభిషేక్

India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 03:43 AM