Delhi Elections: వచ్చే వారంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్?
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:56 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈనెల వచ్చే వారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

న్యూఢిల్లీ, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈనెల వచ్చే వారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఢిల్లీ ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ఫిబ్రవరి 23న ముగియనుండడంతో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికలు జరిపేలా ప్రయత్నాలు ప్రారంభించింది. తుది ఓటర్ల జాబితాను వచ్చే ఈనెల 6వ తేదీన ప్రచురిస్తామని ఈసీ అధికారులు తెలిపారు.