PM Modi: విదేశీ పర్యటనకు వెళ్లిన మోదీ
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:41 AM
ప్రధాని మోదీ యూకే, మాల్దీవుల్లో 4రోజులు పర్యంటించేందుకు బుధవారం బయలుదేరి వెళ్లారు.
న్యూఢిల్లీ, జూలై 23: ప్రధాని మోదీ యూకే, మాల్దీవుల్లో 4రోజులు పర్యంటించేందుకు బుధవారం బయలుదేరి వెళ్లారు. తన పర్యటనతో రెండు దేశాలతో భారత్ దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తంచేశారు. యూకే పర్యటనలో భాగంగా బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో మోదీ భేటీ అవుతారు. ఈ సందర్భంగా భారత్-యూకే స్వేచ్ఛా వాణి జ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకం చేస్తారు. ఈ ఒప్పం దం ద్వారా 99 శాతం భారతీయ ఎగుమతులకు సుంకాల నుంచి మినహాయింపు లభించనుంది. యూకే పర్యటన తర్వాత మోదీ మాల్దీవులకు వెళ్తారు. అక్కడ 26న జరిగే 60వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారు.