PM Modi: ఆ యువ నేతలతో రాహుల్‌కు ఇబ్బంది
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:13 AM
ప్రతిభ కలిగిన యువ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఒక కుటుం బం అభద్రతకు గురవుతుండటం వల్ల వారికి పార్లమెంటులో మా ట్లాడే అవకాశం రావడం లేదంటూ..
అందుకే పార్లమెంటులో వారికి చాన్స్ ఇవ్వడం లేదు: మోదీ
న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ప్రతిభ కలిగిన యువ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఒక కుటుం బం అభద్రతకు గురవుతుండటం వల్ల వారికి పార్లమెంటులో మా ట్లాడే అవకాశం రావడం లేదంటూ.. సోనియాగాంధీ పరివారాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ పరోక్షంగా వ్యాఖ్యానించారు. వారిలోని చురుకుదనం రాహుల్‌గాంధీని అభద్రతకు, ఇబ్బందికి గురిచేస్తున్నదన్నారు. పార్లమెంటు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సుముఖంగా ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తుల మూలంగా మొత్తం వర్షకాల సమావేశాలు భగ్నమయ్యాయని మోదీ అన్నారు. గురువారం ఉభయసభల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ఆయన ఎన్డీయే పార్టీల నేతలకు తేనీటి విందు ఇచ్చా రు. కీలకమైన బిల్లులు ఆమోదం పొందేలా చేసినందుకు మిత్రపక్షాల నేతలను మోదీ అభినందించారు.
మేక్రాన్‌తో మోదీ చర్చలు
ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో యుద్ధ పరిస్థితులపై ప్రధాని మోదీ గురువారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ ఎక్స్‌లో పోస్టు పెడుతూ ‘‘నా మిత్రుడు అధ్యక్షుడు మేక్రాన్‌తో చాలా మంచి సంభాషణ జరిగింది. ఉక్రెయిన్, పశ్చిమ ఆసియాల్లోని ఘర్షణలకు శాంతియుత పరిష్కారాలు కనుక్కొనే దిశగా అభిప్రాయాలు పంచుకున్నాం. భారత్-ఫ్రాన్స్‌ల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని పేర్కొన్నారు.