Share News

వెంకయ్య మనవడి రిసెప్షన్‌కు ప్రధాని

ABN , Publish Date - Mar 11 , 2025 | 05:41 AM

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవడి వివాహ రిసెప్షన్‌కు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఢిల్లీలోని త్యాగరాజ మార్గ్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని విచ్చేసి..

వెంకయ్య మనవడి రిసెప్షన్‌కు ప్రధాని

న్యూఢిల్లీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవడి వివాహ రిసెప్షన్‌కు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఢిల్లీలోని త్యాగరాజ మార్గ్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని విచ్చేసి.. నూతన దంపతులు విష్ణు, సాత్వికలను ఆశీర్వదించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌, కిషన్‌రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్‌ నేతలు, ఆర్‌ఎ్‌సఎస్‌ పెద్దలు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.

Updated Date - Mar 11 , 2025 | 05:41 AM